తిరుమల: రెచ్చిపోయిన దొంగలు.. టీటీడీ ఎలక్ట్రిక్‌ బస్సు చోరీ

24 Sep, 2023 11:38 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్‌ బస్సు అదృశ్యమైంది. గుర్తు తెలియని దుండగులు ఏకంగా బస్సు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే, లోకేషన్‌ ఆధారంగా ఎలక్ట్రిక్‌ బస్సు నాయుడుపేటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో బస్సును స్వాధీనం చేసుకుని దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. తిరుమలలో ఎలక్ట్రిక్‌ బస్సు చోరీకి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బస్సును దొంగతనం చేశారు. చోరీ చేసిన బస్సును తీసుకెళ్తుండగా లోకేషన్‌ ఆధారంగా నాయుడుపేట వద్ద బస్సు గుర్తించారు. దీంతో, బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, వాహనాల మిస్సింగ్‌ను టీటీడీ.. అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. 

ఇది కూడా చదవండి: కదులుతున్న ‘స్కిల్‌’ డొంక.. లోకేష్‌ పీఏ అమెరికాకు జంప్‌!

మరిన్ని వార్తలు