మరో ట్విస్ట్‌: దేవరాజ్‌ తల్లికి శ్రావణి ఫోన్‌

13 Sep, 2020 16:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే దేవరాజ్‌ నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు, ఆదివారం శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుడు సాయిని కూడా విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రావణి, దేవరాజ్‌ తల్లి సత్యవతికి కాల్‌చేసిన ఓ ఆడియో లీకైంది. దీనిలో శ్రావణి-సత్యవతి పలు కీలక అంశాలపై చర్చించారు. దేవరాజ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమైన, అతనితో తన వివాహం జరిపించాలని సత్యవతిని శ్రావణి వేడుకుంది. అంతేకాకుండా కట్నకానుకలతో పాటు పెళ్లి ఖర్చంతా తానే బరిస్తానని కూడా చెప్పింది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌‌లో దేవరాజ్‌పై పెట్టిన కేసు గురించి సత్యవతి ప్రశ్నించింది. మొదట కేసును ఉపసంహించుకోవాలని ఆమె శ్రావణిని కోరింది. (‘సాయి ఆదుకున్నాడు, దేవ ముంచాడు’)

దానికి సరే అన్న శ్రావణి మీరు ఓకే అంటే కేసు విత్‌డ్రా చేసుకున్న తరువాత పెళ్లి చేసుకుంటామని చెప్పింది. తాము ఇద్దం వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటామని సత్యవతిని బతిమిలాడింది. అయితే పోలీసుల విచారణలో ఈ ఆడియో కూడా కీలక కానుంది. కాగా ఈ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన శ్రావణి కుటుంబ సభ్యులు, సాయిలను ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు వీరిద్దరి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. (గువ్వల్ని మింగుతున్న గద్దలు). ,

కొనసాగుతున్న కీలక విచారణ
శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఆదివారం సాయి పోలీసులు ముందు విచారణకు హాజరైయ్యాడు. దేవరాజు, సాయి కృష్ణను ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్న నేపథ్యంలో నేటి విచారనే కీలకం కానుంది. కేసు విచారణ నేపథ్యంలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఉన్న కేసు నుండి తప్పించు కొనేందుకే దేవరాజ్ మరోసారి శ్రావణిని బుట్టలో వేసుకున్నాడని సాయి చెబుతున్నాడు. మరోవైపు సాయి వేధింపులు వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు వాదిస్తున్నాడు.  అయితే ఇద్దరిని విచారిస్తున్న నేపథ్యంలో కేసు నేడు  ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా