వారిద్దరూ కవలలు.. తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న ఏం చేశాడంటే..?

22 May, 2022 21:24 IST|Sakshi

తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న దారుణానికి ఒడిగట్టాడు. అన్నాదమ్ములు ఇద్దరూ కవలలు కావడంతో.. దీన్ని ఆసరాగా తీసుకున్న అన్న.. మరదాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకే రూపంతో ఉన్న అతడి విషయంలో మోసపోయిన ఆమె.. విషయం భర్తకు చెప్పడంతో అతడి సమాధానం విని షాకైంది.

వివరాల ప‍్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం శివాజీనగర్‌లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి కుటుంబంలో ఇద్దరు కవలసోదరులు ఉన్నారు. వారిని ఎవరు అని గుర్తించడమే పేరెంట్స్‌కే కొన్నిసార్లు సాధ్యపడేది కాదు. ఇదిలా ఉండగా.. వాళ్లకు పెళ్లీడు రావడంతో కుటుంబీకులు కవలలైన అమ్మాయిల జంట కోసం వెతికారు. అలా దొరక్కపోవడంతో ఎవరో ఒకరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులు గడిచాక.. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని పెద్దోడు చెప్పడంతో ఆరు నెలల కిందట చిన్నోడికి ఓ అమ్మాయితో వివాహం జరిపించారు.

ఇప్పటి వరకు అంతా బాగానే సాగిన వ్యవహారం.. ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఓ సమయంలో అత్తారింట్లో కాపురానికి వచ్చిన మరదలిపై.. అన్న కన్నేశాడు. అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండటంతో అతడికి అది వరమైంది. ఓ రోజు తమ్ముడు లేని సమయం చూసుకొని అతనిలా గదిలోకి దూరి మరదలితో లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తే కదానే నమ్మకంతో ఆమె కూడా అడ్డుచెప్పలేదు. ఇలా ఆరు నెలలుగా వికృత ఉదంతం కొనసాగుతుండగా.. అనుమానం వచ్చిన ఆమె.. అసలు విషయం తెలుసుకుని షాకైంది. ఈ విషయాన్ని వెంటనే.. తన భర్త, అత్తమామలకు చెప్పేసింది. ఈ క్రమంలో భర్తతో సహా కుటుంభ సభ్యులందరూ అన్నకే మద్దతిచ్చారు. విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని, కాబట్టి నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని భర్తతోపాటు మిగతా అందరూ ఆమెను బెదిరించారు.

వారి బెదిరింపులను లెక్కచేయని బాధితురాలు.. తన పుట్టింటివాళ్లను పిలిపించి, వారి సాయంతో పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. బాధితురాల ఫిర్యాదుతో పోలీసులు కవల సోదరుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్‌ చేసి విచారిస్తున్నట్టు శివాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి దిలీప్ దొలారే తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం..

మరిన్ని వార్తలు