ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం..

22 May, 2022 10:47 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సదుం(చిత్తూరు జిల్లా): మండలంలో జంట హత్యలు శనివారం కలకలం రేపాయి. అమ్మగారిపల్లె పంచాయతీ ఎగువ జాండ్రపేటలోని వాటర్‌ప్లాంటు వద్ద ఇద్దరిని ఎవరో హత్య చేసినట్లు ఉదయం పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఇన్‌చార్జి సీఐ గంగిరెడ్డి, చౌడేపల్లె ఎస్‌ఐ రవికుమార్‌ పరిశీలించారు. హత్యకు గురైన వారు రాధ, వెంకటరమణగా గుర్తించారు.
చదవండి: ఎంగిలిపేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా

పోలీసుల, స్థానికుల కథనం మేరకు, అంగళ్లుకు చెందిన రాధ(28)కు పుట్టపర్తి ఎనమలవారిపల్లెకు చెందిన నరసింహులుతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. నాలుగు నెలల క్రితం భర్తతో మనస్పర్థలు రావడంతో ఆమె తన కూతురు సాయితేజుతో కలిసి విడిగా ఉంటోంది. ఈ క్రమంలో తన అన్న వెంకటరమణ(37), స్నేహితుడు రాముతో కలిసి గత నెల జాండ్రపేటలోని ఓప్రైవేటు వాటర్‌ ప్లాంటులో కూలి పనులకు చేరి, అక్కడే నివాసం ఉంటోంది.

కొద్ది రోజుల క్రితం భర్త నరసింహులు అక్కడికి వచ్చి తనతో వచ్చేయమనడంతో వివాదం రేగింది. ఇటీవల తను తిరిగి భర్త వద్దకు వెళ్లిపోతానని రాధ, రాముకు చెప్పడంతో గత కొద్ది రోజులుగా వారి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే అతను వారిద్దరినీ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాధను బండరాయితో కొట్టి చంపగా, వెంకటరమణ చెవి కింది భాగంలో గాయం ఉంది. సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సాయితేజ(4)ను విచారిస్తున్నారు. వీఆర్వో మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పీలేరుకు తరలించారు.

మరిన్ని వార్తలు