కృష్ణయ్య హత్యకేసులో ఆ ఇద్దరూ లొంగుబాటు

3 Sep, 2022 02:33 IST|Sakshi
తమ్మినేని కోటేశ్వరరావు, ఎల్లంపల్లి నాగయ్యను జిల్లా జైలుకు తరలిస్తున్న పోలీసులు  

ఇందులో ఒకరు తమ్మినేని వీరభద్రం సోదరుడు 

ఖమ్మం లీగల్‌: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో మిగిలిన ఇద్దరు నిందితులు శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. గతనెల 15న జరిగిన కృష్ణయ్య హత్య­కేసులో చార్జీషీట్‌లో నిందితు­లుగా పది మందిని చేర్చారు. హత్య జరిగాక 3 రోజుల వ్యవధిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇక ఏ9గా ఉన్న తమ్మినేని కో టేశ్వరరావు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు), ఏ10గా ఉన్న ఎల్లంపల్లి నాగయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరి అరెస్టులో జాప్యం జరగడంతో పోలీసుల తీరుపై కృష్ణయ్య కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మౌనిక ఎదుట  కోటేశ్వరరావు, నాగయ్య లొంగిపోయారు. న్యాయవాది కొల్లి సత్యనా రాయణ వారిని కోర్టులో ప్రొడ్యూస్‌ చేయగా న్యాయమూర్తి వారికి 14 రోజుల  జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో ఇద్దరినీ జిల్లా జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు