సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఇద్దరు అరెస్టు

3 Jun, 2021 11:00 IST|Sakshi

రాజుపాలెం(సత్తెనపల్లి)/గుంటూరు జిల్లా: నకరికల్లు మండలంలోని కుంకలగుంటకు చెందిన పి.అశోక్, జి.నిరీక్షణరావును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వీరిద్దరూ ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి.ఉదయ్‌బాబు బుధవారం కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేశారు.

చదవండి: పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు    
‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. 

మరిన్ని వార్తలు