ఇద్దరు అసిస్టెంట్‌ కానిస్టేబుళ్ల హత్య 

16 Apr, 2021 05:10 IST|Sakshi
అసిస్టెంట్‌ కానిస్టేబుళ్ల మృతదేహాలు  

చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఇద్దరు అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లు గురువారం హత్యకు గురయ్యారు. జిల్లా ఎస్పీ కేఎల్‌.ధ్రువ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జి పోలీస్‌స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లు పూనెం హరీమ్‌ (29), ధనిరాం కశ్యప్‌ (31) ద్విచక్ర వాహనంపై సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న వైద్యశాలకు పనిపై వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో ద్విచక్ర వాహనాన్ని అటకాయించిన గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు పూనెం హరీమ్‌ది దంతెవాడ జిల్లా నేతల్‌నార్‌ గ్రామం కాగా, కశ్యప్‌ సుకుమా జిల్లా జేగురుగొండ గ్రామం. అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లను మావోయిస్టులు హతమార్చారా? లేక వ్యక్తిగత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారా? అనే కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.

చదవండి: తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది

మరిన్ని వార్తలు