కొత్త బసాపురంలో దంపతుల దారుణ హత్య

3 Sep, 2021 11:37 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కొత్త బసాపురంలో దారుణం జరిగింది. మతిస్థిమితం కోల్పోయిన ఓ యువకుడు సొంత పెదనాన్న పెద్దమ్మను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిద్రిస్తున్న ఇద్దరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. హత్య చేసి అక్కడే దాక్కున్న హంతకుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని కొత్త బసాపురం గ్రామంలో  తొరి వేముల నాగయ్య - నాగమ్మ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. మతిస్థిమితం లేని వీరయ్య అనే యువకుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.. 

చాపాడు మండలం నాగులపల్లెకు చెందిన వీరయ్య హత్యకు గురైన నాగమ్మ చెల్లెలు కొడుకు  కొద్దిరోజులుగా మతిస్థిమితం లేకపోవడంతో చికిత్స కోసం అతని పెద్దమ్మ వద్దకు పంపించారు. రెండు రోజుల నుంచి బాగానే ఉన్నా వీరయ్య అర్ధరాత్రి సమయంలో ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసు వ‌ర్గాల స‌మాచారం. చేరదీసిన సొంత పెద్ద‌మ్మ‌, పెద్ద‌నాన్నను హ‌త్య‌ చేసిన వీరయ్య హత్య చేసిన ప్ర‌దేశంలోనే దాక్కున్నాడు. పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ఓ ఇంట్లో దాక్కున్న వీర‌య్య‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:
వంకలో కొట్టుకుపోయిన కారు: ఇద్దరు గల్లంతు
రాహుల్‌ హత్య కేసు: పోలీసుల అదుపులో గాయత్రి?

మరిన్ని వార్తలు