విషాదం.. స్కూల్‌ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి

3 Jul, 2023 14:00 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి:  బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఈశ్వర్‌(6) తన తండ్రితో కలిసి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆల్కాట్ తోట సమీపంలోని ఐఓసి  వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. బైక్‌ నుంచి పక్కకు పడిన బాలుడి తండ్రికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన మృతుని బంధువులు రాళ్లతో ఆర్టీసీ బస్సు అద్దాలు  పగలగొట్టారు.  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్సార్‌ కడప: జిల్లాలోని జమ్మలమడుగులో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్‌ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంట్లో నుంచి చిన్నారి సఫినా స్కూల్‌ బస్సులో పాఠశాలకు బయల్దేరింది. అయితే పాఠశాలకు చేరుకున్నాక బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్‌ బస్సును ముందుకు వెళ్లనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
చదవండి: మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర

మరిన్ని వార్తలు