ఇద్దరు బాలికలను మింగిన చెరువు..

2 Sep, 2021 08:56 IST|Sakshi

ఆ చెరువు తన మృత్యు దాహం తీర్చుకుంది. ఒక బాలిక చావు నుంచి తప్పించుకుందని సంతోషించే లోపు ఇద్దరిని మింగేసింది. చెల్లి ప్రాణాలను తిరిగి ఇచ్చినట్టే ఇచ్చి అక్కను తీసుకెళ్లిపోయింది. సరదాగా స్నానం చేయడానికి వచ్చిన నలుగురిలో ఇద్దరిని చంపేసి మిగ తా ఇద్దరికి జీవిత కాల భయాన్ని అందించింది. బిడ్డలను అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది.  

సాక్షి,శ్రీకాకుళం(లావేరు): మండల పరిధి యాతపేట గ్రామంలో ని జగ్గు చెరువులో మునిగి పెంటమాని వనజ (9), వనుము యమున(9) అనే ఇద్దరు బాలిక లు బుధవారం మృతి చెందారు. లావేరు స్టేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాల మేరకు.. యాతపేట గ్రామానికి చెందిన పెంటమా ని వనజ(9), వనుము యమున(9), పెంటమా ని యషశ్రీ, శిరీషలు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. బుధవారం మ ధ్యాహ్నం బడి విడిచిపెట్టాక పూజ సామాన్లు చెరువులో కలపడం కోసం వీరు నలుగురు గ్రా మంలోని జగ్గు చెరువుకు వెళ్లారు. పూజ సామాన్లు కలిపేసిన తర్వాత స్నానానికి దిగారు. వనజ, శిరీషలు ఒడ్డునే స్నానం చేస్తుండగా.. యమున, యషశ్రీలు కాస్త లోపలకు వెళ్లారు. అయితే వీరికి ఈత రాకపోవడంతో లోలోపలకు వెళ్లిపోయారు.

దీన్ని గమనించిన యషశ్రీ అక్క వనజ వెంటనే స్పందించి చెరువు లోపలకు వెళ్లి చెల్లిని ఒడ్డుకు తీసుకువచ్చింది. యమునను కూ డా కాపాడదామని ప్రయత్నించి విఫలమై ఆమె తో పాటు లోపలకు వెళ్లిపోయింది. వీరు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో ఒడ్డునే ఉన్న పిల్లలు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులకు విష యం చెప్పారు. వారు హుటాహుటిన చెరువు వద్దకు వచ్చి స్థానికులతో కలిసి వెతకగా మునిగిన చోటే ఇద్దరూ దొరికారు. వెంటనే 108లో వీరిని శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే ఇద్దరూ చనిపోయారని వైద్యులు పరీక్షించి నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వెంటనే లావే రు స్టేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజేష్, హెచ్‌సీ రామారావులు యాతపేట గ్రామానికి వెళ్లి చెరువును పరిశీలించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల ను ప్రమాదం ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు.

గుండెలవిసేలా రోదన..
వనజ, యమునలు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసే లా రోదించారు. పెంటమాని పైడిరాజు, రాజు దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె వనజ. ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె చెరువులో పడి మృతి చెందడంతో వారి రోదన ఆపడం ఎవరి తరం కా లేదు. వనుము రాజారావు, రాములు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నా రు. ఒక్కగానొక్క కుమార్తె అయిన యమున ఇలా చిన్న వయసులోనే చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.

చదవండి: అత్త హత్య కేసులో కోడలి అరెస్ట్‌   

మరిన్ని వార్తలు