పోలీసులే దొంగలు.. పట్టేసిన సీసీ కెమెరాలు

10 Sep, 2021 12:36 IST|Sakshi

చిత్తూరు అర్బన్‌:  రోడ్డుపై బట్టలమ్మే దుకాణంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు చిత్తూరులోని విజయ డెయిరీ సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన చిన్నపాటి వస్త్రదుకాణం పెట్టుకున్నాడు. రాత్రి మూసేసి మరుసటి రోజు దుకాణాన్ని తెరిచేవాడు. నాలుగు రోజుల క్రితం యూనిఫాం ధరించిన ఓ కానిస్టేబుల్, సివిల్‌ డ్రెస్‌లో ఉన్న మరో కానిస్టేబుల్‌ అర్ధరాత్రి దుకాణం వద్దకు వెళ్లి రెండు బండిళ్ల బట్టలను చోరీ చేశారు.

మరుసటి రోజు దుకాణం వద్దకు వచ్చిన దుకాణదారుడు చోరీ అయిన విషయాన్ని గ్రహించి పక్కనే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించాడు. పోలీసులే చోరీ చేసినట్లు గుర్తించాడు. అయితే దీనిపై పోలీసులు దుకాణదారుడిని బతిమలాడడంతో అతను పోలీసులకు చేసిన ఫిర్యాదును వాపస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గురువారం రాత్రి వన్‌టౌన్‌ సీఐ నరసింహారాజును వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామన్నారు.

ఇవీ చదవండి:
ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు