విషాదం: 20 అడుగుల ఎత్తుకు ఎగిరి..

1 Mar, 2021 09:08 IST|Sakshi
సూర్యనారాయణ(ఫైల్‌), గోవిందరావు(ఫైల్‌)  

ట్రాక్టర్‌ టైరు పేలి ఇద్దరి దుర్మరణం

జలుమూరు (శ్రీకాకుళం జిల్లా): ట్రాక్టర్‌ టైరుకు అధికంగా గాలి నింపడంతో పేలిపోయి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా కొమనాపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది.  తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవిందరావు(42) ట్రాక్టర్‌ టైరు పంక్చర్‌ కావడంతో కొమనాపల్లిలోని దాసరి సూర్యనారాయణ (42) షాప్‌ వద్దకొచ్చాడు. టైర్‌కు పంక్చర్‌ వేసిన అనంతరం గాలి ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. సూర్యనారాయణ టైర్‌ డిస్‌్కతో పాటు 20 అడుగుల ఎత్తుకు ఎగిరి విద్యుత్‌ తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ గోవిందరావును 108 సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
ప్రాంక్‌ వీడియో: బాలికలతో అసభ్య ప్రవర్తన
పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్‌ రచ్చరచ్చ

 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు