Rajanna Sircilla Tragedy: గడ్డివాముకు నిప్పు.. పశువులను కాపాడబోయి.. వదిన, మరిది..

21 May, 2022 10:27 IST|Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పశువులను కాపాడబోయి వది న, మరిది కరెంట్‌ షాక్‌తో ప్రా ణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండ లం ఎర్రగడ్డతండాలో ఈ ఘట న జరిగింది. గురువారం రాత్రి తండాలో బానోతు నీల (37), బానోతు రవి(34) ఇంటికి సమీపంలో ఉన్న ట్రా న్స్‌ఫార్మర్‌ నుంచి మంటలు వెలువడి గడ్డివాముకు నిప్పంటుకుంది. దీంతో సమీపంలోని పాకలో ఉన్న పశువులను మంటల నుంచి కాపాడేందుకు నీల, రవి వెళ్లా రు.

అదే సమయంలో మంటలకు విద్యుత్‌ తీగలు తెగి వారిపై పడ్డాయి. తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో కరెంట్‌ షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు, బంధువులు శుక్రవారం ఉదయం మృతదేహాలతో వీర్నపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అక్కడికి చేరుకొని కలెక్టర్, సెస్‌ ఎండీతో మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు