జిరాక్స్‌ కోసం వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం

28 Sep, 2021 07:15 IST|Sakshi

కన్నౌజ్‌: పత్రాలను జిరాక్స్‌ తీయించుకోవడానికి సైబర్‌ కేఫ్‌కు వెళ్లిన ఇద్దరు బాలికలను నలుగురు వ్యక్తులు బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. సెప్టెంబర్‌ 13న ఈ ఘటన జరిగింది. ఓ మహిళ సహా మొత్తం ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రశాంత్‌ వర్మ వెల్లడించారు.

అత్యాచారాన్ని నిందితులు వీడియో తీశారని, ఈ ఘటన బయటకు చెప్తే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించినట్లు 17 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం రూ. 10 వేలు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. దీంతో తాను, తన మిత్రురాలు కలసి తమ ఇళ్లలో దొంగతనం చేసి డబ్బు చెల్లించినట్లు చెప్పారు. డబ్బు పోయిన సంగతిని తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయగా, అత్యాచారం విషయం బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. కేఫ్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు కూడా తేలిందన్నారు. చుట్టుపక్కల వారు సైతం ఆ కేఫ్‌ వద్ద యువతులను పలు మార్లు చూసినట్లు చెప్పారని పేర్కొన్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.   చదవండి: (ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..)

మరిన్ని వార్తలు