వరలక్ష్మి హత్య కేసులో మరో ట్విస్ట్‌

7 Nov, 2020 11:00 IST|Sakshi

గాజువాక(విశాఖపట్నం): స్థానిక శ్రీనగర్‌కు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను గాజువాక పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రేమోన్మాది అఖిల్‌సాయి వెంకట్‌ చేతిలో వరలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సంఘటన జరిగిన రోజే నిందితుడు అఖిల్‌సాయి వెంకట్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కొప్పెర్ల హరి రామకృష్ణరాజు, తంగెళ్ల చిన్న అప్పన్న అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. 

పోలీసుల కథనం ప్రకారం..
వరలక్ష్మితో చనువుగా ఉంటున్నాడనే కారణంతో ఆమె సోదరు డు ఇటీవల వంగపండు రామునాయుడు అనే వ్యక్తితో గొడవపడ్డాడు. మరోసారి తన చెల్లెలతో మాట్లాడినట్టు తెలిస్తే బాగుండదని హెచ్చరించాడు. రెండేళ్ల క్రితం హత్యకు గురైన రౌడీషీటర్‌ కుమారుడు హరి రామకృష్ణరాజుతో ఈ విషయాన్ని చెప్పాడు. దీన్ని అదనుగా తీసుకున్న హరి ఇటీవల రామునాయుడుకు ఫోన్‌ చేసి షీలానగర్‌ వచ్చి తనను కలవా లని, లేనిపక్షంలో ఇబ్బంది పడతావని హెచ్చరించాడు. అతడి ని కలిసిన రామునాయుడుని రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇస్తే ఎవరినుంచీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పాడు. దీంతో రాము నాయుడు అతడికి దఫదఫాలుగా రూ.7వేలు ఇచ్చాడు. ఉప్పర కాలనీ నివాసి, హరి స్నేహితుడు చిన్న అప్పన్న అనే వ్యక్తికి కూడా రూ.1000 ఇచ్చాడు. వరలక్ష్మి హత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు రామునాయుడు ఈ విషయాలు చెప్పడంతో హరి, చిన్న అప్పన్నలను కూడా అరెస్టు చేసినట్టు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ఎస్‌ఐ గణేష్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు