550 కిలోల ఉల్లిని కొట్టేశారు..

23 Oct, 2020 21:27 IST|Sakshi

ముంబై : దేశంలో ఒక్కసారిగా ఉల్లిధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల కిందట చౌకగా లభించిన ఉల్లి.. ఇప్పుడు సామాన్యుడి కొనలేని రేటుకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు దాదాపు 550 కిలోల ఉల్లిని దొంగతనం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. నిందితులను సంజయ్ పరాది, పొపట్ కాలేలుగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన నారాయణ్ గావ్ పోలీసులు వారిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

ఈసారి వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది.ఉల్లిగడ్డ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఇక, ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో కూడా ధరలు పెరిగిన సందర్భాల్లో పలుచోట్ల ఉల్లి దొంగతనాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉల్లి కోసం గొడవలు కూడా జరిగాయి. ధరల విషయంలో వినియోగదారులు, అమ్మకపుదారులు ఘర్షణకు దిగారు.
 

మరిన్ని వార్తలు