చిన్నారి వైద్యం కోసం వెళ్తూ..

14 Apr, 2021 10:23 IST|Sakshi

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

అదుపు తప్పిన వాహనం

మూడునెలల చిన్నారి, డ్రైవర్‌ మృతి 

రామగిరి: చిన్నారికి వైద్యం చేయించేందుకు నగరం నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరిన ఓ కుటుంబం రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు నెలల చిన్నారితో పాటు మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన జాన్, జయ దంపతులకు మూడు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాప మెదడు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా.. హైదరాబాద్‌లోని వైద్యులు బెంగళూరుకు రెఫర్‌ చేశారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం జాన్, జయ దంపతులు, వారి మూడు నెలల చిన్నారి, జాన్‌ తమ్ముడు శ్రీనివాసులుతోపాటు నగరానికే చెందిన వడియాల శ్రీనివాసులు(35) స్కార్పియో వాహనం (ఏపీ02డీ7771) అద్దెకు తీసుకుని బయలుదేరారు. వీరి వాహనం అనంతపురం జిల్లా రామగిరి మండలం పెనుబోలు జాతీయ రహదారి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో డ్రైవింగ్‌ చేస్తున్న వడియాల శ్రీనివాసులు, చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా..జాన్‌ దంపతులు, జాన్‌ తమ్ముడు శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి ప్రాథమిక వైద్యం చేయించారు. రామగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
( చదవండి: చోరీకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయాడు

మరిన్ని వార్తలు