కోవిడ్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

25 Jul, 2020 09:56 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు సీఆర్‌ఆర్‌ కోవిడ్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జిల్లా జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో 13 మందిని కోవిడ్‌ కేంద్రానికి తరలించారు. వీరిలో పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు ఖైదీలు ఇదే అదనుగా భావించి శనివారం తెల్లవారుజామున  సుమారు మూడుగంటల ప్రాంతంలో కోవిడ్‌ కేంద్రం నుంచి పరారయ్యారు. దీంతో ఏలూరు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పరారీలో ఉన్న ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

పరారైన ఖైదీలను పట్టుకుంటాం:ఎస్పీ
ఖైదీలు పరారైనా ఏలూరు సీఆర్‌ఆర్‌ కోవిడ్‌ సెంటర్‌ను ఎస్పీ నారాయణ నాయక్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరారైనా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. పారిపోయిన ఇద్దరు ఖైదీలు ఇంటి చోరీ కేసుల్లో నేరస్తులని వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు