నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు మృతి

19 Sep, 2021 12:44 IST|Sakshi

సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూర్ హైవే ముత్యాలమ్మ గూడెం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అయితే ట్రాఫిక్‌జామ్‌లో లారీ మరొక కారును ఢీకొట్టింది. దీంతో మరో కారులో ఉన్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం మృతుల సంఖ్య అయిదుకు చేరింది. చనిపోయిన ఐదుగురిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. భారీగా హైవేపై ట్రాఫిక్ జామ్‌ను కట్టంగూర్‌ పోలీసులు క్లియర్ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు