Gandhi Hospital: అక్కచెల్లెళ్లపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి!

16 Aug, 2021 17:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌:  గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేషెంట్‌కు సాయంగా వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు కామాంధులు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వేపురిగేరికి చెందిన ఓ వ్యక్తికిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఈ నెల 4న హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆయనకు సాయంగా భార్యతోపాటు ఆమె చెల్లెలు కూడా వెళ్లారు. పేషెంట్‌ను వేరు వార్డుకు మార్చడంతో అది ఎక్కడో తెలియక అక్కాచెల్లెల్లు ఇబ్బందిపడ్డారు. 

ఆ సమయంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‍ వార్డు చూపిస్తానని వారిని నమ్మబలికాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను కిడ్నాప్‌ చేసి ఓ గదిలో బంధించారు. అనంతరం వారికి మత్తుమందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని బయటపడిన బాధితురాలు ఈ విషయంపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి తనపై నాలుగైదుసార్లు అత్యాచారం చేశాడని,అక్క ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాంధీ ఆస్పత్రిలో అయిదు రోజుల క్రితం ఇంత దారుణం జరిగినా వెలుగు చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

విచారణ వేగవంతం
గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ల్యాబ్ టెక్నీషియలన్ ఉమామహేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా సెక్యూరిటీ గార్డు పరార్ అయ్యాడు. ఉమామహేశ్వర్‌, సెక్యూరిటీ గార్డ్ కలిసి అత్యాచారం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు