Accidents In Hyderabad: వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మృతి

8 Jul, 2022 10:10 IST|Sakshi
అశోక్‌ కుమార్‌, దిలీప్‌కుమార్‌ (ఫైల్‌)

చందానగర్, గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందారు.  బుధవారం రాత్రి ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోఓగి అక్కడికక్కడే మృతి చెందాడు. చందానగర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన మేరకు.. వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన మూలపల్లి చంద్రమోహన్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దిలీప్‌ (27) నెల క్రితం ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో చేరాడు. అమీన్‌పూర్‌లో బావ రాకేష్‌ ఇంటిలో నివాసముంటూ గచ్చిబౌలికి ఉద్యోగానికి వెళ్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటలకు దిలీప్‌ కుమార్‌ అతని స్నేహితుడు సూర్యతో కలిసి ఫల్సర్‌ బైక్‌పై అమీన్‌పూర్‌ నుంచి చందానగర్‌ వైపు భోజనం చేసేందుకు వెళ్తున్నారు.

దారిలో రెయిన్‌బో స్కూల్‌  వద్దకు చేరుకోగానే ఆటో టీటీడీ లాజిస్టిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ త్రివీర్‌ వాహనం వేగంగా వచ్చి దిలీప్‌కుమార్‌ వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌ పై ఉన్న దిలీప్‌ కుమార్‌ సూర్య కిందపడగా దిలీప్‌కుమార్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు దిలీప్‌కుమార్‌ను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పీఆర్‌కే ఆస్పత్రికి తరలించారు. 
చదవండి: సైబరాబాద్‌: ఖాకీలపై మూడో కన్ను

గచ్చిబౌలిలో..
మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌కు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బలయ్యాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా జిల్లాకు చెందిన బోయపాటి అశోక్‌ కుమార్‌(26) గువా రెసిడెన్సీ, మియాపూర్‌లో నివాసం ఉంటూ మాస్‌ మ్యూచ్‌వల్‌ కంపెనీలె సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అదే రెసిడెన్సీలో నివాసం ఉంటే మదన్‌ మోహన్‌ రెడ్డి(24) జావా ఎజ్డీ బైక్‌పై వెళ్లి బధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకు అశోక్‌ పికప్‌ చేసుకున్నారు.

విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ట్రిపుల్‌ ఐటీ సబ్‌స్టేషన్‌ వద్ద  ఫుట్‌పాత్‌ను అతి వేగంగా ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలై వెనక కూర్చున్న అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ నడిపిస్తున్న మదన్‌ మోహన్‌ రెడ్డి స్వల్ప గాయాలతో బయటçపడి ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం రామాంజనేయులు దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు