Hyderabad: ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యం

3 Nov, 2022 07:39 IST|Sakshi
అదృశ్యమైన అశ్విని, అమూల్, ఆర్తీ జాజు

సాక్షి, హైదరాబాద్‌(జియాగూడ): ఇంటి నుంచి క్యాబ్‌లో బయలుదేరిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమైన సంఘటన కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జియాగూడ దుర్గా నగర్‌లో  మహారాష్ట్రకు చెందిన బాలు, తన భార్య అశ్విని, ఆర్యన్, అమూల్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే భవనంలో నీలేష్‌ విజయ్‌ కుమార్‌ జాజు, అతని భార్య ఆర్తి జాజు, వంశ్‌జాజు, రషీక అలియాస్‌ చెమ్మితో కలిసి ఉంటున్నాడు.

మంగళవారం ఉదయం నీలేష్, బాలు బయటికి వెళ్లారు. మధ్యాహ్నం అశ్విని, ఆర్తి జాజు తమ పిల్లలు ఆర్యన్, అమూల్, రిషిక లతో కలిసి క్యాబ్‌లో బయటికి వెళ్లారు. రాత్రికి ఇంటికి వచ్చిన బాలు తన తల్లిని భార్యా, పిల్లల విషయమై ఆరా తీయగా మధ్యాహ్నం బయటికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పింది. దీంతో వెంటనే వారి ఫోన్లకు ఫోన్లు చేయగా, స్విచ్చాఫ్‌ వచ్చాయి. దీంతో  బాలు చుట్టుపక్కల వాకాబు చేసినా ఫలితం లేదు.

అర్యన్‌, రషిక

అదే బిల్డింగ్‌లో ఉంటున్న తన బంధువు బాలాజిని ఆరా తీయగా మధ్యాహ్నంఆశ్విని, ఆర్తి పిల్లలతో సహా క్యాబ్‌లో వెళ్లినట్లు తెలిపాడు. నీలేష్‌ కూడా భార్యా పిల్లల కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో బుధవారం నీలేష్‌. ఆశ్విని తమ్ముడు నామ్‌దేవ్‌ కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమోరాల పుటేజీని పరిశీలిస్తున్నా రు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు