కొవ్వూరులో రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువతులు మృతి

30 Jul, 2021 21:26 IST|Sakshi

సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం ఉదయం  రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువతులను క్వారీ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీని లారీ ఢీకొని వారిపై నుండి వెళ్లిపోవడంతో యువతుల శరీరాలు నుజ్జు నుజ్జు  అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతులు కొవ్వూరు 23వ వార్డుకు చెందిన ఈర్ని భార్గవి, తనూషగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు