అడవికి వెళ్లిన యువజంట.. యువతి కిడ్నాప్; ఆపై అత్యాచారం

4 Apr, 2021 05:10 IST|Sakshi

వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరింపులు

ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపిన పోలీసులు

సాక్షి, ఎస్‌ఎస్‌ తాడ్వాయి: పర్యాటక ప్రాంతం చూసేందుకు ఓ జంట బైక్‌పై వెళ్లింది. దీనిని గమనించిన ఇద్దరు వ్యక్తులు యువకుడిని బెదిరించి ఫోన్‌ లాక్కోవడమే కాకుండా యువతిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతికి తీవ్ర రక్తస్రావం అవడంతో తిరిగి ఇంటి వద్ద దిగబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి యువతి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీ సులు శనివారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ములుగు జిల్లా ఎస్‌ఎస్‌.తాడ్వాయి మండలంలోని పర్యాటక స్థలమైన బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ అటవీ ప్రాంతానికి గతనెల 30న ఓ జంట బైక్‌పై వచ్చారు. వీరిని గమనించిన బొట్టాయిగూడెంకు చెందిన కోల సాత్విక్‌ అలియాస్‌ సైదులు, జనగామ ఆనందరావు అటకాయించి యువకుడిని కొట్టి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు.

ద్విచక్రవాహనం టైర్లలో గాలి కూడా తీసేశారు. యువతిని బలవంతంగా బైక్‌పై మణుగురు తీసుకెళ్లారు. అక్కడ నిందితుడు సాత్విక్‌ యువతిని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. దీనికి  ఆనందరావు సహకరించాడు. అయితే, యువతికి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆనందరావు బైక్‌పై ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లి వదిలేశాడు. అత్యాచారం వీడియో తీశామని, విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తామని బెదిరించడంతో ఆమె భయప డింది. చివరకు ఆమె స్నేహితుడు ఫిర్యాదు చేయ డంతో సీఐ శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై వెంక టేశ్వరరావు రంగంలోకి దిగి, నిందితులని కాటా పూర్‌ క్రాస్‌ వద్ద శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు