మనోళ్లే కదా అని నమ్మి ఆమెను వారితో పంపిస్తే.. అక్కడ బైక్‌ ఆపి ఏం చేశారంటే..?

9 Jun, 2022 21:26 IST|Sakshi

దేశంలో యువతులు, మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారిని కిరాతకంగా హత్య చేశారు. 

వివరాల ప్రకారం.. గుమ్లా జిల్లాలోని పొరుగు గ్రామంలో బాధితురాలి కుటుంబ సభ్యులు ఓ పెళ్లికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారు. వారి ఊరికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ రూట్‌లో వస్తున్న తమ గ్రామానికి చెందిన వ్యక్తులు బైక్‌ మీద వచ్చారు. దీంతో వారిని ఆపి.. తన కూతురును ఇంటి వద్ద డ్రాప్‌ చేయాలని మైనర్‌ తండ్రి కోరాడు. తర్వాత, గ్రామానికి వెళుతున్న క్ర‌మంలో బాధితురాలని నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకువెళ్లిన నిందితులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 

అనంతరం ఆమె పేరెంట్స్‌ ఇంటికి వచ్చాక.. కన్నీరుపెట్టుకుని జరిగిన విషయం వారికి చెప్పింది. ఈ విషయం వారు గ్రామ పెద్దలకు చెప్పడంతో గ్రామ‌స్తులు ఆగ్ర‌హంతో నిందితుల‌ను చితకబాదారు. నిందితులపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఓ నిందితుడు అక్కడే కాలిన గాయాలతో మరణించగా.. మరో వ్యక్తి కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: భర్త నుంచి విడాకులు.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

మరిన్ని వార్తలు