విద్యార్థితో టీచర్‌ శృంగారం.. ‘అవకాశం లేదు’

23 Jan, 2021 16:53 IST|Sakshi
కాండిస్‌ బార్బర్‌(ఫైల్‌ ఫొటోలు)

లండన్‌ : 15 ఏళ్ల విద్యార్థితో వివాహితురాలైన ఉపాధ్యాయురాలి శారీరక సంబంధం కేసుపై ఏమెర్‌షమ్‌ లా కోర్టు శుక్రవారం విచారణ జరిపింది.  తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని 35 ఏళ్ల బకింగ్‌హామ్‌షిర్‌ ఉపాద్యాయురాలు కాండిస్‌ బార్బర్‌ కోర్టుకు తెలిపింది. తన బిజీ లైఫ్ స్టైల్‌ కారణంగా విద్యార్ధితో ఆరు బయట శృంగారంలో పాల్గొనే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘సంఘటన జరిగిందంటున్న రోజు( 2018, అక్టోబర్‌ 10)న నేను ఫోస్టర్‌ కేర్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో పాల్గొన్నాను. ఆ సమావేశం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమై.. 6:30 ముగిసింది. ( యజమాని కోసం 6 రోజులు ఆసుపత్రి బయటే.. )

ఆ తర్వాత రోజు కూడా నేను ఊర్లో లేను. స్నేహితురాలితో కలిసి లండన్‌లో జరుగుతున్న ఓ కంసర్ట్‌కు వెళ్లాను’’ అని తెలిపింది. బార్బర్‌ వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. కాగా, సదరు 15 ఏళ్ల విద్యార్థికి కాండిస్‌ బార్బర్‌ తన అర్థనగ్న ఫొటోలు, ఇతర అసభ్యకర వీడియోలు సైతం పంపినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కుంటోంది. ( జాక్‌పాట్‌.. రాత్రికిరాత్రే కోటీశ్వరుడు )

మరిన్ని వార్తలు