Russia Ukraine War: రష్యా అకృత్యాలు.. మాటలు రావడం లేదు! ఈ ఒక్క ఫొటో చాలు

4 Apr, 2022 13:57 IST|Sakshi

Ukrainian Member of Parliament Lesia Vasylenk: ఉక్రెయిన్‌ పై నెలరోజులకు పైగా దాడులు కొనసాగిస్తున్న రష్యా ఇప్పుడు మరింత దారుణమైన అకృత్యాలకు పాల్పడుతోంది. రష్యా బలగాలను వెనక్కి మళ్లించి సైనిక దాడిని తగ్గించింది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. ఇప్పుడు యుద్ధ నేరాలకు పాల్పడుతోంది రష్యా. ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌కి సమీపంలో బుచా నగరంలో రష్యా బలగాలు పౌరులపై అత్యంత దారుణంగా కాల్పులు జరపడమే కాకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఉక్రెనియన్ ఎంపీ, పార్లమెంటు సభ్యురాలు లెసియా వసిలెంక్  ట్విట్టర్‌లో రష్యా ఆగడాల పై విరుచుకుపడ్డారు. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని ప్రజలను దోచుకోవడమే కాకుండా అత్యాచారాలు చేసి చంపుతున్నారని ఆక్రోశించారు. రష్యాని అనైతిక నేరాల దేశంగా అభివర్ణించారామె. మైనర్లని కూడా చూడకుండా అత్యాచారాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ పార్ట్‌లను నాశనం చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా రేప్‌ చేసి శరీరాలపై స్వస్తిక్‌ ఆకారంలోని ముద్రలు వేస్తున్నారని చెప్పారు. అత్యాచారం చేసి చంపేసిన మహిళ మృతదేహం ఇది. మాటలు రావడం లేదు. నా మనస్సు కోపం, ద్వేషంతో స్తంభించిపోయింది అని ట్వీట్ ఆమె చేశారు. 

యుద్ధానికి సంబంధించిన ముఖ్యాంశాలు:

  • ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది.  అప్పటి నుంచి నిరవధిక దాడులతో ఉక్రెయిన్‌ పై విరుచుకుపడుతూనే ఉంది.
  • యుద్ధంలో వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోగా, 4 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
  • రాజధాని కైవ్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లి ఉక్రెయిన్ తూర్పు భాగాలపై దృష్టి సారిస్తామని రష్యా గత వారం ప్రకటించింది. 
  • రష్యా బలగాల తిరోగమనం నేపథ్యంలో వారు విధ్వంసాన్ని విడిచిపెట్టి నరమేథానికి పాల్పడుతున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్‌లో బుచా నగరం చుట్టూ అనేక మృతదేహాలు పడి ఉన్నాయి.
  • రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించగా, రష్యా ఆరోపణలను ఖండించింది.

(చదవండి: భయానకం: ఉక్రెయిన్‌ బుచాలో శవాల గుట్టలు.. అత్యాచార బాధితుల శవాలు!)

మరిన్ని వార్తలు