కొడుకు ఆత్మహత్య.. కారణం కోడలేనని.. వెంటాడి మరీ మామ దారుణం

4 Jan, 2022 17:16 IST|Sakshi
సాయి కృష్ణ, సౌందర్య(ఫైల్‌) 

పెద్దలకు ఇష్టంలేకున్నా ప్రేమ పెళ్లి

3 నెలల క్రితం సాయి కృష్ణ ఆత్మహత్య

కోటపల్లి(చెన్నూర్‌): కోడలిని మామ హత్య చేయడం మంచిర్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. కొడుకు కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేక.. కుమారుడి ఆత్మహత్యకు కోడలే కారణమన్న కక్షతో కత్తితో ఆమె గొంతు కోసి దారుణానికి పాల్పడ్డాడు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, పోలీసుల కథనం ప్రకారం.. లింగన్నపేటకు చెందిన రాళ్లబండి సాయికృష్ణ, బోరగళ్ల సౌందర్య ప్రేమించుకున్నారు.

ఇద్దరిది వేర్వేరు సామాజికవర్గాలు  కావ డంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఏడాది క్రితం వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకు న్నారు. కొన్నాళ్లు మంచిర్యాలలో, అనంతరం కోటపల్లిలో జీవనం సాగించారు. ఈ క్రమంలో అప్పు లు పెరిగిపోవడంతో సాయికృష్ణ మద్యానికి బానిస గా మారి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తన కుమారుడి మరణానికి కోడ లే కారణమని సాయి కృష్ణ తండ్రి తిరుపతి కక్ష పెం చుకున్నాడు.

తన కుమారుడు ఆ యువతిని పెళ్లి చేసుకోవడం వల్ల గ్రామంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నానని స న్నిహితులతో చెబుతుండేవాడు. ఈ నేపథ్యంలో తమ కూతురికి ప్రాణహాని ఉందని గ్రహించిన సౌందర్య తల్లిదండ్రులు ఆమె ను వేరే గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంచారు. ఇటీవల సౌందర్య తల్లిదండ్రులను చూడడానికి రావడంతో హత్య చేసేందుకు తిరుపతి పథకం వేశాడు. సోమ వారం మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లగా మంచంపై దుప్పటి కప్పుకుని తండ్రి లస్మయ్య, సౌందర్య వేర్వేరుగా నిద్రిస్తున్నారు.

సౌందర్య ఎక్కడుందో తెలియక మొదటగా తిరుపతి కత్తితో లస్మయ్యపై దాడి చేశాడు. వెంటనే అతడు తేరుకుని కేకలు వే యడంతో పక్కనే నిద్రిస్తున్న సౌందర్య(24) ప్రాణభయంతో బయటకు పరుగెత్తింది. అయితే తిరుప తి ఆమెను వెంబడించి మరీ అతి కిరాతకంగా గొం తుపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సౌందర్య మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తిరుపతి దాడిలో తీవ్ర గా యాలైన లస్మయ్య చికిత్స పొందుతున్నాడు. జైపూ ర్‌ ఏసీపీ నరేందర్‌ ఆస్పత్రిలో లస్మయ్యతో మాట్లా డి వివరాలు సేకరించారు. నిందితుడు తిరుపతి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడి ని తమకు అప్పగించాలని, అప్పటివర కు తాము పోలీసులకు ఫిర్యాదు చేయబోమని మృ తురాలి బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు.  

మరిన్ని వార్తలు