దారుణం: కోడలిపై మామ అత్యాచారం, కేసు నమోదు

26 Feb, 2021 13:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భరోసా కేంద్రానికి బాధితురాలి తరలింపు  

మామ కోడలిద్దరూ ఢిల్లీకి చెందినవారు 

నాంపల్లి: కోడలిపై మామ అత్యాచారం చేసిన సంఘటన హబీబ్‌నగర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడిపై  కేసు నమోదు చేశారు. హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీకి చెందిన ఓ వస్త్రవ్యాపారి(52) అతడి కుమారుడి భార్య(21) ఇరువురు దుస్తుల కొనుగోలు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. బజార్‌ఘాట్‌ రోడ్డులోని సుభాన్‌ బేకరీ ఎదురుగా ఉండే ఎన్‌ఆర్‌ రెసిడెన్సీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.

బట్టల కొనుగోలు చేయడానికి వచ్చిన ఇరువురు బుధవారం రాత్రి లాడ్జిలోని అద్దె గదిలోనే బస చేశారు. మరుసటి రోజు కోడలు తన మామపైన హబీబ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది.  బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించారు. భరోసా కేంద్రం నుంచి కేసుకు సంబంధించిన  నివేదిక రాగానే తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్ర తెలియజేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు