Doctor Missing Case: వీడని మిస్టరీ.. డాక్టర్‌ జయశీల్‌రెడ్డి ఏమయ్యారు?

7 Sep, 2021 12:01 IST|Sakshi
వ్యవసాయ బావివద్ద ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌ రెడ్డి, సుధీర్‌రెడ్డి. ఇన్‌సెట్‌లో జయశీల్‌రెడ్డి

ఎమ్మెల్యే దేవిరెడ్డి బాబాయ్‌ కుమారుడి కేసులో వీడని మిస్టరీ

బావిలోపడ్డారేమోనని నీళ్లు తోడుతున్న పోలీసులు

నల్లగొండ క్రైం: ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బాబాయ్‌ కుమారుడు దేవిరెడ్డి జయశీల్‌రెడ్డి (42) నల్లగొండ మండ లం మేళ్లదుప్పలపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి కనిపించకుండాపోయిన ఉదంతం మిస్టరీగా మారింది. వ్యవ సాయ క్షేత్రంలోని బావిలో పడ్డారా లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం డ్రైవర్‌ పల్లయ్యను తీసుకుని వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. డ్రైవర్‌ను గెస్ట్‌హౌస్‌లో ఉండమని చెప్పి క్షేత్రం లోపలికి వెళ్లా రు.

అక్కడ ఉన్న కుంట అలుగు పోస్తున్న ఫొటోలను మేనమామ వినోద్‌రెడ్డికి ఉదయం 7.30కి వాట్సాప్‌లో పెట్టారు. 8.11 గంటలకు తల్లి సునందతో ఫోన్‌లో మాట్లాడారు. 9 గంటలకు ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో కుటుంబసభ్యులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు తెలిపారు. డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించగా శునకం గ్రామాల్లోకి వెళ్లి, తిరిగి వ్యవసాయ క్షేత్రంలో అటూఇటూ తిరిగి వ్యవసాయ బావి వద్ద ఆగింది. దీంతో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి ఉంటారా అన్న కోణంలో బావిలో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడిస్తున్నారు.  

డాక్టర్‌ కోర్సు చదివిన జయశీల్‌రెడ్డి
జమైకాలో డాక్టర్‌ కోర్సును పూర్తిచేసిన జయశీల్‌రెడ్డి ఈనెల 8న యూఎస్‌ఏలో ఉన్న సోదరి వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే వెళ్లడం ఇష్టంలేదని కుటుంబసభ్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ పరిశీలించారు.  

మరిన్ని వార్తలు