డర్టీ పిక్చర్‌కు కటకటాలే 

13 Sep, 2020 09:24 IST|Sakshi

అశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌ చేసేవారిపై నిఘా సంస్థల దృష్టి  

గూగుల్‌తో సమన్వయం  

పోలీస్, సీసీబీ బృందాల కార్యాచరణ  

బెంగళూరు : అశ్లీల ఫోటోలు, వీడియోలను సేకరించి ఇంటర్నెట్లో, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ పైశాచికానందం పొందే  వికృత కాముకుల ఆట కట్టించేందుకు రాష్ట్ర పోలీసు, నిఘా విభాగాలు గట్టి చర్యలు తీసుకోబోతున్నాయి.  అలా అప్‌లోడ్‌ చేసేవారు ఏ మూల ఉన్నా సాంకేతిక ఆధారాలతో గుర్తించి కటకటాల వెనక్కు పంపనున్నారు.   

పోర్న్‌తో పదుల సమస్యలు  
దేశంలో పోర్న్‌ వెబ్‌సైట్ల వీక్షణం నిషేధించినప్పటికీ చాటుమాటుగా చూస్తున్నవారి సంఖ్య తక్కువేం కాదు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మరింతగా పెరిగినట్లు పలు సర్వేలు కూడా హెచ్చరించాయి. మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడులకు ఇటువంటి వెబ్‌సైట్లు కూడా కారణమవుతున్నాయని ప్రభుత్వాలు, ఎన్జీవోలు ఎప్పటినుంచో వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చిన్నారులపై దౌర్జన్యాల నియంత్రణ విభాగం (ఎన్‌సీఎంఇసీ)ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం, గూగుల్‌తో పోలీసులు, సీసీబీ సంప్రదింపుల్లో ఉంటూ వికృత కాముకులను పసిగడతారు.    ( ముగ్గురు పూజారుల దారుణ హత్య )

ఇటీవలి కేసులు  
బెంగళూరులో ఇంటర్నెట్లో బాలల అశ్లీల చిత్రాలను పోస్ట్‌ చేస్తున్న ఉడుపికి చెందిన సౌరవ్‌శెట్టి అనే యువకుడిని సైబర్‌ క్రైంపోలీసులు ఇటీవల ఇదే రీతిలో చేశారు.  బెంగళూరు చామరాజపేటే రౌడీ మంజునాథ్‌ అలియాస్‌ కోడి మంజు కూడా ఒక అశ్లీల చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చెయ్యగా, పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐడీ సైబర్‌ విభాగ డీవైఎస్‌పీ కేఎన్‌.యశవంత్‌కుమార్‌ తెలిపారు.

నిందితులు దొరికిపోతారు ఇలా  
సోషల్‌ మీడియాలో అశ్లీల వీడియోలు, ఫోటోలు అప్‌లోడ్‌ చేస్తే గూగుల్‌ తన సాంకేతిక పరిజ్ఞానంతో అలాంటి వారి సమాచారం సేకరించి కేంద్ర హోంశాఖ కు తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వ బృందాలు, గూగుల్‌ ఇచ్చే ఐపీ అడ్రస్‌ వివరాలు ఆధారంగా దుండగుల చిరునామా, మొబైల్‌ నంబర్‌ ఆచూకీ కనిపెట్టి రాష్ట్రాల సైబర్‌క్రైం పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా దుండగులు ఎక్కడ ఉన్నా అరెస్టు చేస్తారు.

మరిన్ని వార్తలు