Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు

13 Oct, 2021 14:51 IST|Sakshi

కొల్లాం: కేరళలోని కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది.  డబ్బు కోసం ప్లాన్‌ ప్రకారం అతని భార్యను పాముతో కాటేయించి హతమార్చిన వ్యక్తికి రెండు సార్లు జీవిత ఖైదు శిక్షలను విధించింది. ఈ మేరకు కొల్లాం అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ఎం మనోజ్‌ .. ఈ కేసు అరుదైనది. దోషి వయసు చూస్తే - 28 సంవత్సరాలు కనుక అతనికి మరణశిక్షకు బదులుగా జీవిత ఖైదు విధించాలని తీర్పునిస్తున్నట్లు తెలిపారు. . సూర‌జ్‌పై న‌మోదు అయిన కేసుల్లో .. ఓ కేసులో ప‌దేళ్లు, మ‌రో కేసులో ఏడేళ్ల శిక్ష ప‌డింది.

మొత్తంగా సూర‌జ్ 17 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది. జీవిత‌ఖైదు శిక్ష‌తో పాటు అత‌నికి 5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. కాగా 2020 లో లాక్‌డౌన్‌ సమయంలో నిందితుడు సూరజ్‌ భార్యపైకి పామును ఉసిగొల్పి నెలరోజుల్లో రెండు సార్లు ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. కాగా మొదటి సారి విఫలం కాగా రెండో సారి ఆమె మృతి చెందింది.

ఉతరా మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త సూరజ్ తన ఆస్తి కోసం ప్రయత్నించాడు. దీంతో మహిళ తల్లిదండ్రులు, ఉతారా మరణంపై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో కోర్టు అతనికి 2 సార్లు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 

చదవండి: పాము కాటుతో మహిళ హత్య.. ట్విస్ట్‌లతో పోలీసుల మైండ్‌ బ్లాక్‌!

మరిన్ని వార్తలు