త‌ల్లిదండ్రుల‌ను మ‌త్తులోకి పంపించి.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే..

30 May, 2021 20:27 IST|Sakshi

లక్నో: ప్రియుడితో కలిసి త‌న సొంత ఇంట్లోనే ఓ యువ‌తి దొంగ‌త‌నానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోసాయిగంజ్‌లో చోటుచేసుకుంది. చోరిలో రూ. 13 ల‌క్ష‌ల న‌గ‌దు, రూ.3 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాల‌ను అప‌హ‌రించింది. సౌత్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఖ్యాతి గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వ్యాపార‌వేత్త మ‌నోజ్ ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగిందని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేయగా.. విలువైన వ‌స్తువులు భ‌ద్ర‌ప‌రిచిన లాక‌ర్ల‌న్నీ పగలకొట్టి ఉన్నా, ఎవ‌రూ బ‌ల‌వంతంగా ప్ర‌వేశించిన‌ట్లుగా ఆన‌వాళ్లు లేవ‌ని తెలిసుకున్నారు.

దీంతో పోలీసులు దర్యాప్తుని ఇంట్లో వాళ్లతో మొదలు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్‌ కుమార్తె చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో ఆమెపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను గట్టిగా విచారించగా నేరాన్ని అంగీకరించింది. తాను, ప్రియుడు విన‌య్ యాద‌వ్‌,  స‌హాయ‌కుడు శుభం యాద‌వ్‌తో కలిసి ఈ చోరి చేసినట్లు తెలపడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. కాగా మ‌రో నిందితుడు రంజిత్ యాద‌వ్ ఇంకా ప‌రారీలో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. దొంగతనం జరిగిన రోజు రాత్రి ఖుష్బు తేనీరులో నిద్ర‌మాత్ర‌లిచ్చి కుటుంబ సభ్యులను మ‌త్తులోకి జారుకునేలా చేసింది. అనంత‌రం ప్రియుడు, అత‌డి స్నేహితుల‌ను ఇంట్లోకి రానిచ్చి పాల్పడినట్లు తెలిపిందని పోలీసులు తెలిపారు. దొంగలించిన సొమ్ము మొత్తం రిక‌వ‌రీ చేసిన‌ట్లు చెప్పారు.

చదవండి: నా పిల్లలను నువ్వే చూడాలిరా తమ్ముడూ అని కాల్‌ రికార్డు చేసి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు