యూపీలో మరో ఘోరం.. తిరనాళ్లకు వెళ్లిన మైనర్‌ను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారం

21 Sep, 2022 15:46 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల బాలికను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు నలుగురు కిరాతకులు. మొరాదాబాద్‌ జిల్లాలో  సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పక్క గ్రామంలో తిరనాళ్లకు వెళ్లినప్పుడు స్థానిక యువకులు ఆమెపై కన్నేసి ఈ క్రూర చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం బాలిక నగ్నంగా తన స్వగ్రామానికి వెళ్తుండగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి అంకుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్లో ఇప్పటివరకు ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 7న తమకు ఫిర్యాదు అందిందని  పోలీసుల చెప్పారు. బాధితురాలి తల్లిదండ్రులను అడిగితే తమ కూతురికి జరిగిన విషయం చెప్పలేదని పేర్కొన్నారు. అయినా తాము దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామన్నారు. విచారణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
చదవండి: హోటల్‌ రూమ్‌లో లవర్‌తో భర్త రాసలీలలు.. భార్య ఎంట్రీతో సీన్‌ రివర్స్‌!

మరిన్ని వార్తలు