రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు

23 Sep, 2022 21:41 IST|Sakshi

 దెహ్రాదూన్‌: 19 ఏళ్ల యువతి హత్య కేసులో ఉత్తరాఖండ్ బీజేపీ సీనియర్ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్‌కిత్ ఆర్యను పోలీసులు అరెస్టు చేశారు. తన రిసార్టులో పని చేసే ఆమెను మరో ఇద్దరితో కలిసి ఇతను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మొదట యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె అదృశ్యమైందని సోమవారం ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. పుల్‌కిత్ కూడా ఎవరికీ అనుమానం రాకుండా స్టేషన్కు వెళ్లి తమ రిసార్టులో పనిచేసే యువతి మిస్ అయిందని ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు.

అయితే తల్లిదండ్రులు పుల్కిత్ ఆర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. తన రిసార్టులో పనిచేసే మరో ఇద్దరు సిబ్బందితో కలిసి యువతిని హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రిసార్టు సమీపంలోని చిల్లా కాలువతో పడేశారు. శవాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని, సహాయక బృందాలతో వెతుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పుల్‌కిత్ తండ్రి రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉ‍న్న బీజేపీ నేత. ఎలాంటి హోదా లేకుండానే మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్‌ఎస్ నేత అయినందు వల్లే ఆయన కుమారుడి కేసులో పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ మాత్రం కేసు విచారణను పారదర్శకంగా జరిపిస్తామని హామీ ఇచ్చారు.
చదవండి: ఏడేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు.. షాకిచ్చిన ప్రియురాలు.. ఏం చేసిందంటే?

మరిన్ని వార్తలు