ఉత్తరాఖండ్‌లో దారుణం.. కదులుతున్న కారులో తల్లీ, కూతురిపై సామూహిక అత్యాచారం

27 Jun, 2022 17:41 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొందరు కామాంధులు సాయం పేరుతో కదులుతున్న కారులో తల్లి, కుమార్తెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. హరిద్వార్‌ జిల్లాలోని రూర్కీ ప్రాంతంలో ఆదివారం ఈ అమానుషం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిరాన్‌ కలియార్‌ నుంచి ఓ మహిళ తన ఆరేళ్ల కూతురితో కలిసి రాత్రి సమయంలోఇంటికి వెళుతోంది.  

అదే సమయంలో అటుగా కారులో వెళుతున్న సోనూ అనే వ్యక్తి మహిళకు లిఫ్ట్‌ ఇస్తానని చెప్పాడు. మాయమాటలతో వారిద్దరిని కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే అతని కారులో తన స్నేహితులు కూడా ఉన్నారు. అయితే మహిళ పట్ల కీచక బుద్దితో ఉన్న యువకులు.. కదులుతున్న కారులోనే తల్లి, కూతుళ్లపై సామూహిక అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనంతరం వారిని కాలువ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు.

అర్ధరాత్రి తన కుమార్తెతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు తనకు జరిగిన ఘోరం గురించి పోలీసులకు వివరించింది. బాధితులిద్దరిని పోలీసులు రూర్కీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల పరీక్షలో ఇద్దరిపైనా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది. కారులో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని మహిళ స్పష్టంగా చెప్పలేకపోతున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
చదవండి: మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి

మరిన్ని వార్తలు