వనస్థలిపురం అగ్నిప్రమాదం కేసులో ట్విస్ట్

26 May, 2021 08:51 IST|Sakshi

హైదరాబాద్‌: అనుమానాస్పదస్థితిలో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైన వనస్థలిపురం ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి  కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదని పోలీసులు నిర్థారణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో కాపాడేందుకు యత్నించిన భర్త బాలకృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉ‍న్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని మొదట స్థానికులు భావించారు. కానీ భర్తే ఆమెను హత్యచేసి.. పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని మృతురాలి బంధువులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదని నిర్ధారించారు.
చదవండి: వివాహిత సజీవ దహనం: హత్యా.. ప్రమాదమా?

మరిన్ని వార్తలు