ఏటీఎంలో చోరీ.. పాత నేరస్థులపై అనుమానం

16 Nov, 2020 12:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురంలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంలో సోమవారం చోరీ జరిగింది. ఈ చోరీకి సంబంధించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ చోటుచేసుకుంది. ఏటీఎం చోరీ చేయడానికి మొత్తం ఐదు మంది ముఠా సభ్యులు కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. దుండగుల్లో ఏటీఎంలోకి గ్యాస్ కటర్‌తో ఒక్కరూ మాత్రమే వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (టట్లుబాజీ గ్యాంగ్: కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లు)

నాలుగు ఏళ్ల క్రిందట ఇదే ఏటీఎంలో ఈ దుండగులు చోరీకి  పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. తాజా చోరీ నేపథ్యంలో పాత నేరస్థులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులు 6 బృందాలుగా దుండగుల కోసం గాలిస్తున్నారు. ఏటీఎంలో అలారం లేకపోవడంతో రెండవ సారి కూడా దొంగతనం  జరిగిందని పోలీసులు భావిసున్నారు. కనీస అలారం సౌకర్యం ఏర్పటుచేయని ఏటీఎం మేనేజ్‌మెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చోరీలో దుండగులు ఏటీఎం నుంచి ఎంత మొత్తం దోచుకెళ్లారనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు