నడ్డి విరిచిన అధిక వడ్డీ ఆశ

4 Aug, 2021 03:31 IST|Sakshi
టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేయడానికి తరలివచ్చిన బాధితులు

రూ.50కోట్లకు మహిళ కుచ్చుటోపీ

పోలీసు స్టేషన్లకు బాధితుల క్యూ 

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సత్యనారాయణపేటలో నివాసముంటున్న విజయలక్ష్మి చిట్టీలు నిర్వహించేది. హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్లతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది నుంచి అధిక వడ్డీ ఆశ చూపి అప్పుల రూపంలో తీసుకుంది. ఈ డబ్బుతో ఫైనాన్స్‌ కంపెనీ నడుపుతోంది. రూ.50 కోట్లు పోగయ్యాక ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. దీంతో తాము మోసపోయామని బాధితులు టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ సీఐ మన్సూరుద్దీన్‌కు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 మంది ఫిర్యాదులు అందజేశారు.

వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోనూ ఫిర్యాదులు అందాయి. విజయలక్ష్మి భర్త చనిపోయాడని, ఆమెకు కుమారుడు అశోక్‌కుమార్‌ ఉన్నాడని బాధితులు తెలిపారు. కొడుకుతో కలిసే ఆమె ఈ మోసాలకు పాల్పడిందన్నారు. విజయలక్ష్మి కుటుంబం ఎక్కడి నుంచో వచ్చి హిందూపురంలో సెటిల్‌ అయ్యారని చెప్పారు. హిందూపురానికి వచ్చిన జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప ఈ వ్యవహారంపై విచారణ చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  

>
మరిన్ని వార్తలు