విజిలెన్స్‌ దాడి: భారీ ఎత్తున రెమిడిసివర్‌ ఇంజక్షన్‌లు..

20 Apr, 2021 20:26 IST|Sakshi

నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిధిలోని పొగతోటలో రెమిడిసివర్‌ ఇంజక్షన్‌లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను విజిలెన్స్‌ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఒక హాస్పిటల్‌కు అనుబంధంగా ఉ‍న్న ల్యాబ్‌ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని భావించిన అధికారులు సోషల్‌ మీడియా వేదికగా ఇంజక్షన్‌ కావాలని అడ్వర్టెజ్‌ మెంట్‌ ఇచ్చారు. అయితే దీనికి సదరు ముఠా స్పందించింది.

ఆ ముఠా సదరు వ్యక్తికి, ఒక్కొక్క​ ఇంజక్షన్‌ను రూ. 25 వేల చోప్పున.. మూడు బాక్సులకు నాలుగున్నర లక్షలకు అమ్మేలా డీల్‌ కుదుర్చుకుంది. అయితే, అప్పటికే ఈ విషయం తెలిసి మాటువేసి  ఉన్న విజిలెన్స్‌ అధికారులు వారిపై దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో భారీ మొత్తంలో రెమిడిసివర్‌ ఇంజక్షన్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు