విజిలెన్స్‌ దాడులు.. ఆరు ఆస్పత్రులపై కేసులు

6 May, 2021 19:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ: ఏపీలో వరుసగా పలు ఆస్పత్రులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులలో పలు ఆసుపత్రులపై కేసులను నమోదు చేసినట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పేర్కొన్నారు. కాగా ఏపీ వ్యాప్తంగా ఇ‍ప్పటి వరకు 30 ఆసుపత్రులపై దాడులు నిర్వహించిన విజిలెన్స్‌  అధికారులు 6 ఆస్పత్రులపై కేసులను నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఒక ఆస్పత్రిపై  అధిక ఫీజులు వసూలు చేసినందుకు కేసు నమోదు చేశారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లా పుత్తూరు సుభాషిణి ఆస్పత్రిపై ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి నిరాకరించినందుకు కేసును నమోదు చేశారు. విజయవాడలోని వేదాంత ఆస్పత్రి , శ్రీకాకుళం లోని సూర్యముఖి ఆస్పత్రులు  పేషెంట్లు స్వంతంగా రెమిడిసివర్‌ తెచ్చుకోవాలని పట్టుబట్టడంతో వాటిపై కూడా కేసులను బుక్‌ చేశారు. కాగా కడప జిల్లా సిటీ కేర్‌ ఆస్పత్రి కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసింది. పైగా వాటికి బిల్లులు ఇ‍వ్వలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదులు అందిన ప్రతి ఆస్పత్రులపై కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. 

>
మరిన్ని వార్తలు