అంతా కట్టుకథే 

4 Mar, 2021 10:49 IST|Sakshi

విజయనగరం విద్యార్థిని కేసులో వెలుగులోకి నిజం

తనకుతానే కాళ్లు, చేతులు కట్టుకుని నటించిన యువతి 

విజయనగరం క్రైమ్‌/సాక్షి, అమరావతి: కాళ్లూ, చేతులూ బంధించి ముళ్ల పొదల్లో ఉన్న ఓ విద్యార్థినిని రక్షించిన కేసులో పోలీసులు అసలు విషయం రాబట్టారు. తనకు తానే కాళ్లూ, చేతులు చున్నీతో కట్టేసుకుని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు ఆ విద్యార్థిని నటించిందని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గుర్ల పోలీసు స్టేషన్‌కి సమీపంలో ఇటీవల జరిగిన ఈ ఘటనను పోలీసులు సీరియస్‌ తీసుకుని విచారించారు. మొదట ఏమీ తెలియదని చెప్పిన ఆ విద్యార్థిని.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపెట్టింది.

బాబాయి ఇంటికి వెళ్తానని గత నెల 27న హాస్టల్‌లో అనుమతి తీసుకుని స్నేహితుడితో బయటకు వెళ్లింది. అదే సమయంలో తన గురించి హాస్టల్లో అన్న వాకబు చేసినట్లుగా తెలుసుకుని కట్టుకథకు తెరతీసింది. ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఎక్కి గుర్ల దాటిన తర్వాత దిగింది. అక్కడే రోడ్డుపక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించేందుకు తనకుతానే బంధించుకుంది. ఈ విషయం సీసీ ఫుటేజ్‌ల ద్వారా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు.

వాస్తవాలు తెలుసుకో లోకేశ్‌ 
గుర్ల విద్యారి్థని ఘటనపై నిజాలు తెలుసుకోకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇటీవల చేసిన ట్వీట్‌పై పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థిని సమాచారం అందిన వెంటనే స్పందించి విచారణ పోలీసులు చేపట్టారు. అయినా లోకేశ్‌ మాత్రం సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించారు.
చదవండి:
భార్య తప్పటడుగులు.. మార్పు రాకపోవడంతో.. 
అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..

మరిన్ని వార్తలు