జి.కొండూరు పీఎస్‌లో దేవినేని ఉమాపై కేసు నమోదు

28 Jul, 2021 17:36 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై జి.కొండూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని దాసరి సురేశ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషిస్తూ కర్రలు, రాడ్లు, రాళ్లతో తనను గాయపరచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవినేని ఉమా, ఆయన అనుచరులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని సురేశ్‌ తెలిపారు.

ఈ క్రమంలో దేవినేని ఉమాపై 188, 147, 148, 341, 323, 324, 120బి, 109, 307, 427,.. 506, 353, 332 రెడ్‌విత్‌ 149 ఐపీసీ, 3ఈడీఏ, 3(1)R, 3(1)S,.. 3(2)V, ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్‌ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దేవినేని ఉమాతో పాటు మొత్తం 18 మందిపై కేసు పెట్టారు.  

కాగా జి.కొండూరుకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతలు దాడి చేసిన విషయం విదితమే. అదే విధంగా దళిత కార్యకర్త సురేశ్‌పై కూడా దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దాడులకు ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సురేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు