Vijayawada Crime News: కారులో బిజినెస్‌మాన్‌ మృతదేహం.. కేసులో పురోగతి

19 Aug, 2021 18:54 IST|Sakshi

సాక్షి,అమరావతి: విజయవాడలో కలకలం రేపిన కారులో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే రాహుల్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా కారులో కీలకమైన ఆధారాలు లభించాయి. రాహుల్‌ను ముగ్గురు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాహుల్ ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు.

బుధవారం రాత్రి కారులో మూడు గంటల పాటు ఇరువర్గాల మద్య ఓ విషయంలో వివాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణ కు వచ్చారు. రాహుల్ హత్య వెనుక ఓ ఫైనాన్స్ వ్యాపారి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి మెడకింది భాగం ఒరుసుకు పోయినట్లు క్లూస్ టీం గుర్తించింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను  ఏర్పాటు చేశారు. కారు తిరిగిన ప్రాంతం లో సీసీ ఫుటేజ్ ను  పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు