బెజవాడ పోలీసుల అదుపులో బంగ్లాదేశీయులు

3 Jul, 2021 14:17 IST|Sakshi

దర్భంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు

సాక్షి, విజయవాడ: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశ్ యువకులను విజయవాడ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. తల్లానా జిల్లా నుంచి భారత్‌లోకి బంగ్లాదేశీయులు ప్రవేశించారు. హావ్‌డా-వాస్కోడిగామా ట్రైన్‌లో వెళ్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. పాస్‌పోర్టు లేకుండా భారత్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దర్భంగా ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసం భారత్‌లోకి అక్రమంగా వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వీరితోపాటు మరికొందరు బంగ్లాదేశీయులు భారత్‌లోకి ప్రవేశించినట్లు నిర్ధారణ అయ్యింది. పలు రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడి నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి నకిలీ పాన్‌, ఆధార్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు