48 గంటల్లో నా భార్య ఆచూకీ కనుక్కోండి!

26 Jun, 2022 02:09 IST|Sakshi
కూతుళ్లతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సత్యమూర్తి ఫ్యామిలీ ఫొటో 

లేదంటే ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటా

సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వ్యక్తి

తాండూరు: తన భార్య కనిపించకుండా పోయి నాలుగు నెలలు కావస్తున్నా పోలీసులు ఆమె ఆచూకీని కనుక్కోవడం లేదని, 48 గంటల్లో కేసును ఛేదించకపోతే ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి ఓ వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారస్తుడు దొరిశెట్టి సత్యమూర్తి ప్రస్తుతం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

ఆయన భార్య అన్నపూర్ణ మార్చి 6వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లి పోయారు. దీనిపై సత్యమూర్తి తాండూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకు న్నారు. అయితే పోలీసులు కేసు గురించి పట్టించు కోవడం లేదని సత్యమూర్తి ఆరోపించారు. శుక్రవా రం రాత్రి తన ఇద్దరు కూతుళ్లతో కలసి సెల్ఫీ వీడి యో తీశారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ కను క్కోవాలని, లేదంటే పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని డెడ్‌లైన్‌ విధించారు.

శుక్రవారం రాత్రి 2 గంటల నుంచి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకు ని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా, సత్యమూర్తి ఎక్కడున్నా రావాలని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ కోరారు. సత్యమూర్తి సెల్ఫీ వీడియో సోషల్‌ మీడి యాలో వైరల్‌ కావడంతో శనివారం ఆయన మీడి యా సమావేశం నిర్వహించారు. అన్నపూర్ణ మిస్సిం గ్‌ కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని వార్తలు