ప్రేమ పేరుతో మోసం.. మాయమాటలు చెప్పి లోబర్చుకుని..

10 May, 2022 13:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తాండూరు రూరల్‌(వికారాబాద్‌ జిల్లా): ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బాలిక గర్భం దాల్చి, ప్రసవించిన సంఘటన తాండూరు మండలం జినుగుర్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది. చైల్డ్‌లైన్‌ అధికారులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(15). స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఖదీర్‌ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
చదవండి: స్నేహానికి ద్రోహం.. ఫ్రెండ్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని..

దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది. గత శుక్రవారం కడుపులో నొప్పి వస్తోందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఏడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. బాలిక పడుతున్నవి పురిటి నొప్పులని (ప్రీ డెలివరీ) చెప్పారు. అదే రోజున బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది.  చైల్డ్‌లైన్‌ సిబ్బంది బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. విచారణ చేసిన సీడీపీఓ రేణుక సదరు బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ కరన్‌కోట్‌ పోలీస్‌ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.   

మరిన్ని వార్తలు