వికారాబాద్‌లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య

22 Feb, 2021 14:09 IST|Sakshi

రాజకీయకారణల వల్లే హత్య జరిగింది అంటున్న గ్రామస్తులు

సాక్షి, వికారాబాద్: పాత కక్షల నేపథ్యంలో పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదుల హత్యోదంతాన్ని మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. మండల పరిషత్‌ మాజీ అధ్యక్షురాలి భర్తను.. గ్రామ సర్పంచ్‌ దారుణంగా హత్య చేశాడు. పెద్దేముల్‌ మండలం హన్మపూర్‌లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. పెద్దేముల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వాణిశ్రీ భర్త వీరప్పకు, స్థానిక గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా వివాదం చెలరేగుతోంది. 

ఈ నేపథ్యంలో సోమవారం సర్పంచ్‌ కుటుంబ సభ్యులు వీరప్పపై దాడి చేశారు. ఊరడమ్మ గుడి దగ్గర కర్రలతో కొట్టి హత్య చేశారు. రాజకీయ కక్షల వల్లే హత్య జరిగిందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. దారుణం గురించి తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు