బాలికకు మద్యం తాగించి లైంగిక దాడి 

13 May, 2022 14:22 IST|Sakshi
నిందితులు చాకలి రవి, కుర్వ ప్రవీణ్‌ (ఫైల్‌) 

సాక్షి, వికారాబాద్‌: బాలికపై ఒకరు లైంగిక దాడికి పాల్పడగా.. మరొకరు యత్నించారు. ఈ ఘటన  పూడూరు మండలంలో చోటుచేసుకుంది. పరిగి సీఐ వెంకటరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాపూర్‌కు చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందిన కుర్వ ప్రవీణ్‌ (19) పొలంలోకి లాక్కెళ్లాడు. బలవంతంగా మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఇది గమనించిన మరో యువకుడు చాకలి రవి (29) అక్కడికెళ్లడంతో ప్రవీణ్‌ అక్కడి నుంచి జారుకున్నాడు. అదే అదనుగా భావించిన రవి.. బాలికపై లైంగికదాడికి పాల్పడుతుండగా ప్రతిఘటించి బాలిక ఇంటికి చేరుకుంది. విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: బాలికపై ఏడాదిగా లైంగిక దాడి.. గర్భం దాల్చడంతో

మరిన్ని వార్తలు