ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే

1 Mar, 2021 12:50 IST|Sakshi

రూ.1.5 లక్షల సుపారీ ఆఫర్‌ చేసిన యువతి

మర్డర్‌ ప్లాన్‌కు సహకరించిన యువతి తల్లిదండ్రులు అరెస్ట్

ముంబై : సుపారి ఇచ్చి ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చేయించింది ఓ యువతి. ఈ దారుణ ఘటన మహారాష్ష్ర్టలో  చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..నాగ్‌పూర్‌కు చెందిన చందూ మహాపూర్‌ అనే వ్యక్తి 20 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని కోరగా అతడు ఒప్పుకోలేదు. ఇదివరకే పెళ్లయి, పిల్లలు కూడా ఉండటంతో రెండో పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి ప్రియుడిని పథకం​ ప్రకారం హత్య చేయించింది. ఇందుకోసం ప్రియుడి స్నేహితుడు, దూరపు బందువైన భరత్‌ గుర్జార్‌ అనే వ్యక్తిని నియమించుకుంది. తన ప్రియుడిని హత్య చేస్తే  రూ.1.5 లక్షల సుపారీతో పాటు ఓ రాత్రి నీతో గడుపుతానంటూ బంపర్‌ ఆఫర్‌ చేసింది. దీనికి అంగీకరించిన నిందితుడు..పార్టీ ఇస్తానని చెప్పి యువతి ప్రియుడిని తీసుకెళ్లాడు.

ఫుల్లుగా మద్యం తాగించి తలపై బండరాయి మోది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని క్రషింగ్‌ మెషిన్‌లో పడేసి పారిపోయాడు. నిందితుడికి ఇదివరకే చందూతో డబ్బు విషయంలో వివాదం ఉందని, అది కూడా మనసులో పెట్టుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజి ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మర్డర్‌ ప్లాన్‌లో యువతికి సహకరించిన ఆమె తల్లిదండ్రులను సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

చదవండి : (వివాహేతర సంబంధం: ప్రియుడు, ప్రియురాలు మృతి)
(మద్యం మత్తు: భర్త ముందే భార్యతో అసభ్య ప్రవర్తన)


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు